కీర్తనలు త్యాగరాజు చని తోడితేవే వో మనసా
హరికాంభోజి - ఆది
పల్లవి:
చని తోడితేవే వో మనసా ॥చ॥
అను పల్లవి:
కనికరమ్ముతో కనికరమిడి చిర
కాలము సుఖమనుభవింప వేగమె ॥చ॥
చరణము(లు):
పతితుల బ్రోచే పట్టాధికారిని
పరమార్థమత విశిష్ఠానుసారిని
ద్యుతి నిర్జిత శతశంబరారిని
ధురీణ త్యాగరాజ హృచ్చారిని ॥చ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - chani tooDiteevee voo manasaa ( telugu andhra )