కీర్తనలు త్యాగరాజు చలమేలరా సాకేతరామ
మార్గహిందోళం - దేశాది
పల్లవి:
చలమేలరా సాకేతరామ ॥చ॥
అను పల్లవి:
వలచి భక్తిమార్గముతోను నిన్ను
వర్ణించుచున్న నాపై ॥చ॥
చరణము(లు):
ఎందుబోదు నేనేమి చేయుదును
ఎచ్చోటని మొర బెట్టుదును
దందనలతో ప్రొద్దుపోవలెనా
త్యాగరాజ వినుత తాళగ జాలరా ॥చ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - chalameelaraa saakeetaraama ( telugu andhra )