కీర్తనలు త్యాగరాజు చిన్న నాఁడే నా చేయి బట్టితివి
కళానిధి - దేశాది
పల్లవి:
చిన్న నాఁడే నా చేయి బట్టితివి ॥చిన్న॥
అను పల్లవి:
ఎన్నరాని యూడిగము గైగొని
యెంతో నిన్ను పాలమున సేతునని ॥చిన్న॥
చరణము(లు):
ఇట్టి వేళ విడనాడుదా మనియో
యేలుకొందామనియో యెంచినావో తెలియ
గుట్టుబ్రోవవే సుగుణ వారినిధి!
గొప్ప దైవమా! త్యాగరాజనుత! ॥చిన్న॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - chinna naa.rDee naa cheeyi baTTitivi ( telugu andhra )