కీర్తనలు త్యాగరాజు చూతాము రారే సుదతులార రంగపతిని
ఆరభి - రూపక
పల్లవి:
చూతాము రారే సుదతులార రంగపతిని జూ..
అను పల్లవి:
సీతాపతి పూజ్యుఁడట శృంగార శేఖరుఁడట చూ..
చరణము(లు):
సరిగంచు శాలువట చౌకట్ల పోగులట
పరవంపుప్రాయమట పరమాత్ముడట రంగని చూ..
ముఖనిర్జిత చంద్రుఁడట ముద్దుమాటలాడునట
సుఖమొసంగి బ్రోచునట సుందరాంగుఁడట రంగని చూ..
ఆగమ సంచారుఁడట అఖిలజగత్పాలుడట
త్యాగరాజ సన్నుతుడఁట తరుణులార రంగ పతిని చూ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - chuutaamu raaree sudatulaara raMgapatini ( telugu andhra )