కీర్తనలు త్యాగరాజు చెంతనే సదా యుంచుకోవయ్య
కుంతలవరాళి - దేశాది
పల్లవి:
చెంతనే సదా యుంచుకోవయ్య ॥చెంతనె॥
అను పల్లవి:
మంతు కెక్కు శ్రీ మంతుఁడౌ హను
మంతు రీతిగ శ్రీకాంత! ॥చెంతనె॥
చరణము(లు):
తలచిన పనులను నే దెలిసి
తలతో నడచి సంతసిల్లుదురా
పలుమారు బల్క బనిలేదు రామ!
భరతునివలె త్యాగరాజనుత ॥చెంతనె॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - cheMtanee sadaa yuMchukoovayya ( telugu andhra )