కీర్తనలు త్యాగరాజు చెడెడు బుద్ధి మానురా
అఠాణ - ఆది
పల్లవి:
చెడెడు బుద్ధి మానురా ॥చెడెడు॥
అను పల్లవి:
ఇడెడు పాత్ర మెవరో జూడరా ॥చెడెడు॥
చరణము(లు):
భూవాసికిఁ దగు ఫలము గల్గునని
బుధులు బల్క వినలేదా మనసా
శ్రీవాసుదేవ సర్వమనుచును
చింతించర త్యాగరాజ వినుతుని ॥చెడెడు॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - cheDeDu buddhi maanuraa ( telugu andhra )