కీర్తనలు త్యాగరాజు జగదానందకారక! జయ జానకీ ప్రాణ నాయక!
నాట - ఆది
పల్లవి:
జగదానందకారక! జయ జానకీ ప్రాణ నాయక! జ..
అను పల్లవి:
గగనాధిప! సత్కులజ! రాజ రాజేశ్వర!
సుగుణాకర! సుజనశ్సేవ్య! భవ్య దాయక! సదా సకల జ..
చరణము(లు):
అమర తారక నిచయ కుముద హిత
పరిపూర్ణానఘ! సురసురభూ
జ దధి పయోధి వాస హరణ!
సుందరతర వదన! సుధామయ వ
చో బృంద గోవింద సానంద! మా
వరాజ రాప్త శుభకరా! నేక జ..
నిగమనీరజా మృత్పోషక!
నిమిషవైరి వారిద సమీరణ!
ఖగ తురంగ! సత్కవి హృదాలయా!
గణితవానరాధిప! నతాంఘ్రియుగ! జ..
ఇంద్ర నీలమణి సన్నిభాపఘన!
చంద్ర సూర్య నయ నాప్రమేయ! వా
గీంద్ర జనక! సకలేశ! శుభ్ర నా
గేంద్ర శయన! శమనవైరి సన్నుత! జ..
పాద విజిత మౌని శాప! సవ పరి
పాల! వర మంత్ర గ్రహణ లోల!
పరమ శాంత! చిత్తజనకజాధిప!
సరోజ భవ వరదా! ఖిల జ..
సృష్టి స్థిత్యంతకార కామిత!
కామిత ఫలదా! సమాన గాత్ర! శ
చీపతి నుతాబ్ధి! మద హరానురా
గ రాగ రాజిత కథా సారహిత! జ..
సజ్జన మానసాబ్ధి సుధాకర! కు
సుమ విమాన సురసా రిపు కరాబ్జ
లాలిత చరణావగుణా సురగణ
మదహరణ సనాతనా! జనుత జ..
ఓంకార పంజర కీర పుర
హర సరోజ భవ కేశవాది
రూప! వాసవ రిపు జనకాంతక! క
లాధర కలాధారాప్త! ఘృణాకర! శ
రణాగత జనపాలన! సుమనో ర
మణ! నిర్వికార! నిగమసారతర జ..
కరధృత శరజాలా! సురమ
దాప హరణా! వనీసుర సురావన!
కవీన బిలజమౌని కృత చరిత్ర
సన్నుత శ్రీత్యాగరాజనుత! జ..
పురాణ పురుష! నృవరాత్మజా! శ్రిత
పరాధీన! ఖరవిరాధ రావణ
విరావణ! అనఘ! పరాషర మనో
హర! వికృత త్యాగరాజ సన్నుత! జ..
అగణిత గుణ! కనక చేల!
సాల విదళ నారుణాభ సమాన చర
ణా! పార మహిమాద్భుత! సుకవిజన
హృత్సదన! సురముని గణ విహిత! కల
శ నీరనిధిజా రమణ! పాప గజ
నృసింహ! వర త్యాగరాజనుత! జ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - jagadaanaMdakaaraka! jaya jaanakii praaNa naayaka! ( telugu andhra )