కీర్తనలు త్యాగరాజు జయతు జయతు సకల నిగమాగమ కుశల కిన్నర కింపురుష
చూర్ణిక
జయతు జయతు సకల నిగమాగమ కుశల కిన్నర కింపురుష
సిద్ధ విద్యాధర గీయమాన బహుజగదుదయరక్షణ
లయహేతుభూత చతురానన హరిహరప్రభృతి
చింత్యమానమణిద్వీపే - జిత సాధుహృత్తాపే
సకల సురమునినికర భక్తజననిచయ హృదయకామిత
సంతానసౌభాగ్య ధనకనక వాహనాద్యష్టైశ్వర్యదాయక
చింతామణిమయ మహావైకుంఠనగరే నేత్రానందకరే
చండమార్తాండమండల విలసిత సప్త హేమ ప్రాకార
శోభాయమాన భానుకోటిసమాన వజ్రస్తంభాయుత
సహిత సువర్ణమంటపాంతరే శుభతరే
నవరత్నఖచిత కనకమయ హంసతూలికాతల్పే
శరశ్చంద్రకోటినిభ శేషతల్పే
సురనాయకా ద్యష్టదిక్పాలమకుట మణిగణనీరాజిత
పదారవిందః జగదానందః ఉభయపార్శ్వోజ్వలితకర్ణ
కుండలనిందిత చంద్రమండలః సేవితమునిమండలః
భక్తత్రాణపరాయణః శ్రీమన్నారాయణః
లక్ష్మీరమణో భగవాన్‌
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - jayatu jayatu sakala nigamaagama kushala kinnara kiMpurushha ( telugu andhra )