కీర్తనలు త్యాగరాజు జ్ఞానమొసఁగరాదా గరుడ గమన వాదా
గమనశ్రమ - రూపకము (షడ్విధ మార్గణి - రూపక)
పల్లవి:
జ్ఞానమొసఁగరాదా గరుడ గమన వాదా ॥జ్ఞా॥
అను పల్లవి:
నీ నామముచే నామది నిర్మలమైనది ॥జ్ఞా॥
చరణము(లు):
పరమాత్ముఁడు జీవాత్ముఁడు పదునాలుగు లోకములు
నర కిన్నర కింపురుషులు నారదాది మునులు
పరిపూర్ణ! నిష్కళంక! నిరవధి సుఖదాయక!
వర త్యాగరాజార్చిత! వారము తాననే ॥జ్ఞా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - JNaanamosa.rgaraadaa garuDa gamana vaadaa ( telugu andhra )