కీర్తనలు త్యాగరాజు తత్త్వ మెఱుఁగఁ దరమా పర
గరుడధ్వని - రూపకము
పల్లవి:
తత్త్వ మెఱుఁగఁ దరమా పర ॥త॥
అను పల్లవి:
తత్త్వమసి యనే వాక్యార్థము రామ! నీ వను పర ॥త॥
చరణము(లు):
తామస రాజస గుణముల తన్నుకోళ్లు బోదయా
రామభక్తుఁడైన త్యాగరాజ వినుత! వేదశాస్త్ర ॥త॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - tattva meRu.rga.r daramaa para ( telugu andhra )