కీర్తనలు త్యాగరాజు తనమీదనే జెప్పుకొనవలె గా
భూషావళి - దేశాది
పల్లవి:
తనమీదనే జెప్పుకొనవలె గా
కను నిన్నాడ బనిలేదురా త..
అను పల్లవి:
చనువున కొంత బల్కేవు యీ
సున కొంత బల్కేవను నేరమెల్ల త..
చరణము(లు):
ఒకవేళ నిన్ను ప్రేమమీఱ మది
మంచి మంచి పూల బూజింపుచు
ఒకవేళ కోపగించి నిన్ను దూరు
చుంటిగాని రామ త్యాగరాజనుత త..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - tanamiidanee jeppukonavale gaa ( telugu andhra )