కీర్తనలు త్యాగరాజు తనయందే ప్రేమ యనుచు విరిబోణులు
భైరవి - చాపు
పల్లవి:
తనయందే ప్రేమ యనుచు విరిబోణులు
తల తెలియక నాడెదరు త..
అను పల్లవి:
అనయము మోహము మీఱఁగ కృష్ణుఁడు
అందఱికన్ని రూపములెత్తి యాడఁగ త..
చరణము(లు):
కొందఱి బంగారు కొంగులు బట్ట
కొందఱి పదములు బాగుగ నెట్ట
కొందఱి సొగసును గనులారఁ జూడ
కొందఱి మనసుఁదెలిసి మాటలాడ త..
కొందఱి యంకమునను బవ్వళింప
కొందఱి పెదవులఁ బలుకెంపులుంచ
కొందఱి తనువుల కరలీలసేయ
కొందఱి వెనుకనిలిచి జడవేయ త..
కొందఱి నుదుటఁ గస్తూరి బొట్టువెట్ట
కొందఱి తళుకు చెక్కుల ముద్దుబెట్ట
కొందఱి బాలిండ్లఁ బన్నీరు జిల్క
కొందఱితో త్యాగరాజనుతుఁడు బల్క త..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - tanayaMdee preema yanuchu viribooNulu ( telugu andhra )