కీర్తనలు త్యాగరాజు తప్పి బ్రతికి పోవ - తరమా? రామ! కలిలో
తోడి - రూపకము
పల్లవి:
తప్పి బ్రతికి పోవ - తరమా? రామ! కలిలో ॥తప్పి॥
అను పల్లవి:
ముప్పున విషయ తటాక - మున మునుగక దృఢ మనసై ॥తప్పి॥
చరణము(లు):
కంచుమొదలు లోహధన - కనకములను జూచి విష
మంచు మఱియు పెంచికనుచు - యెంచి యంటని మనసై ॥తప్పి॥
నంగనాచుల మానగు - యంగవస్త్రముల బాగగు
ముంగురులను గని యంత - రంగమునను యాశించక ॥తప్పి॥
జాజి మల్లె మందార సరోజములను - మనసార
రాజపథముచే త్యాగ - రాజనుతుని పూజించక ॥తప్పి॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - tappi bratiki poova - taramaa? raama! kaliloo ( telugu andhra )