కీర్తనలు త్యాగరాజు తవదాసోహం, తవదాసోహం, తవదాసోహం దాశరథే
పున్నాగవరాళి - ఆది
పల్లవి:
తవదాసోహం తవదాసోహం
తవదాసోహం దాశరథే ॥తవ॥
చరణము(లు):
వరమృదుభాష విరహిత దోష
నరవర వేష దాశరథే ॥తవ॥
సరసిజనేత్ర పరమపవిత్ర
సురపతిమిత్ర దాశరథే ॥తవ॥
నిన్ను కోరితిరా నిరుపమశూర
నన్నేలుకోరా దాశరథే ॥తవ॥
మనవిని వినుమా మరవ సమయమా
ఇనకుల ధనమా దాశరథే ॥తవ॥
ఘనసమనీల మునిజనపాల
కనక దుకూల దాశరథే ॥తవ॥
ధర నీ వంటి దైవము లేడంటి
శరణను కొంటి దాశరథే ॥తవ॥
ఆగమవినుత రాగవిరహిత
త్యాగరాజనుత దాశరథే ॥తవ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - tavadaasoohaM, tavadaasoohaM, tavadaasoohaM daasharathee ( telugu andhra )