కీర్తనలు త్యాగరాజు తులసీ బిల్వ మల్లికాది జలజ సుమ పూజల గైకొనవే
కేదారగౌళ - ఆది
పల్లవి:
తులసీ బిల్వ మల్లికాది జలజ సుమ పూజల గైకొనవే ॥తులసీ॥
అను పల్లవి:
జలజాసన సనకాది కరార్చిత
జలదాభ సునాభ విభాకర హృ
జ్జలేశ హరిణాంక సుగంధ ॥తులసీ॥
చరణము(లు):
ఉరమున ముఖమున శిరమున నేత్రమున
కరమున భుజమున చరణ యుగంబున
కరుణతో నెనరుతో పరమానందముతో
నిరతమును శ్రీత్యాగరాజ నిరుపాధికుఁడై యర్చించు ॥తులసీ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - tulasii bilva mallikaadi jalaja suma puujala gaikonavee ( telugu andhra )