కీర్తనలు త్యాగరాజు తొలి జన్మమున జేయు దుడుకు దెలిసెను రామ
బిలహరి - ఝంప
పల్లవి:
తొలి జన్మమున జేయు దుడుకు దెలిసెను రామ ॥తొలి॥
అను పల్లవి:
ఫలమేమొ యరచేతి వంటి కద్దము వలె నా ॥తొలి॥
చరణము(లు):
రాగి పయిరుల చెంత రమ్యమౌ వరి మొలక
రాజిల్ల నేర్చునటరా
నాగశయన త్యాగరాజ పాపముతోను
నామ పుణ్యము చెలగునా ॥తొలి॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - toli janmamuna jeeyu duDuku delisenu raama ( telugu andhra )