కీర్తనలు త్యాగరాజు దొరకునా ఇటువంటి సేవ
బిలహరి - ఆది
పల్లవి:
దొరకునా ఇటువంటి సేవ దొ..
అను పల్లవి:
దొరకునాల్పతపమొనరించిన భూ
సురవరులకైన సురలకైన దొ..
చరణము(లు):
తుంబురనారదులు సుగుణకీర్త
నంబుల నాలాపము సేయగా
అంబరీషముఖ్యులు నామము సే
యఁగ జాజులపై చల్లఁగా
బింబాధరలగు సురవారయళి
వేణులు నాట్యములాడఁగా
అంబుజభవ పాకారు లిరుగడల
నన్వయ బిరుదావళిని బొగడఁగా
అంబరవాస సతులు కరకంక
ణంబులు ఘల్లని విసరఁగ మణిహా
రంబులు గదలగ మాచే ఫణి త
ల్పంబున నెలకొన్న హరిని గనుఁగొన దొ..
మరకతమణిసన్నిభ దేహంబున
మెఱుఁగు కనకచేలము శోభిల్లఁ
చరణయుగ నఖావళికాంతులు
జందురు పిల్లలను గేర
వరనూపురము వెలుగఁగ గరయుగమున
వజ్రపుభూషణములు మెఱయ
నురమున ముక్తాహారములు మఱియు
ఉచితమైన మకరకుండలంబులు
చిఱునవ్వులుగల వదనంబున ముం
గురు లద్దంపుఁ గపోలము ముద్దు
గురియు దివ్యఫాలంబునఁ దిలకము
మెఱసే భువిలావణ్యనిధిని గన దొ..
తామసగుణరహిత మునులకుఁ బొగడఁ
దరముగాకనే భ్రమసి నిల్వఁగ
శ్రీమత్కనకపుఁ దొట్లపైని చెలు
వందఁగఁ గొలువుండఁగ
కామితఫలదాయకీయౌ సీత
కాంతునిగని యుప్పొంగఁగ
రామ బ్రహ్మతనయుఁడౌ త్యాగ
రాజు తా బాడుచు నూచఁగ
రాముని జగదుద్ధారుని సురరిపు
భీముని త్రిగుణాతీతుని బూర్ణ
కాముని చిన్మయరూపుని సద్గుణ
ధాముని కనులార మదిని గనుగొన దొ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - dorakunaa iTuvaMTi seeva ( telugu andhra )