కీర్తనలు త్యాగరాజు నను పాలింప నడచి వచ్చితివో నాప్రాణనాథ
మోహన - దేశాది
పల్లవి:
నను పాలింప నడచి వచ్చితివో నాప్రాణనాథ ॥న॥
అను పల్లవి:
వనజనయన మోమును జూచుట జీ
వనమని నెనరున మనసు మర్మము దెలిసి ॥న॥
చరణము(లు):
సురపతి నీలమణినిభ తనువుతో
నురమున ముత్యపు సరుల చయముతో
కరమున శర కోదండ కాంతితో
ధరణి తనయతో త్యాగరాజార్చిత ॥న॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - nanu paaliMpa naDachi vachcitivoo naapraaNanaatha ( telugu andhra )