కీర్తనలు త్యాగరాజు నన్ను బ్రోవ నీకింత తామసమా నాపై నేరమేమి బల్కుమా
అభోగి - దేశాది
పల్లవి:
నన్ను బ్రోవ నీకింత తామసమా?
నాపై నేరమేమి బల్కుమా? ॥నన్ను॥
అను పల్లవి:
చిన్ననాఁడె నీ చెలిమి గలుగ గోరి
చింతింప లేదా? శ్రీరామ! ॥నన్ను॥
చరణము(లు):
నిజదాస వరులగు తమ్ములతో
నీవు బాగ బుట్టగలేదా?
గజరాజరక్షక! తనయులను
కనిపెంచలేదా? త్యాగరాజనుత! ॥నన్ను॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - nannu broova niikiMta taamasamaa naapai neerameemi balkumaa ( telugu andhra )