కీర్తనలు త్యాగరాజు నమ్మక నే మోసబోదునటరా నటరాజవినుత
అసావేరి - రూపకము
పల్లవి:
నమ్మక నే మోసబోదునటరా నటరాజవినుత ॥న॥
చరణము(లు):
దుర్విషయమ్ములు మనసున దూరక చేసే నిను నెఱ ॥న॥
ధన తనయ కళత్రాదులు తమదని బుద్ధీయని నిను ॥న॥
ఇంద్రియముల కాహ్లాద మిచ్చే రూపముగల నిను ॥న॥
బొమ్మరిండ్లుగాని నెఱ నమ్మకు భవమును యనునిను ॥న॥
నెమ్మదిలేని జనన మరణమ్ములఁ దొలగించే నిను ॥న॥
రఘుకుల రత్నమా త్యాగరాజార్చిత పదయుగ నిను ॥న॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - nammaka nee moosaboodunaTaraa naTaraajavinuta ( telugu andhra )