కీర్తనలు త్యాగరాజు నమ్మి వచ్చిన నన్ను నయముగఁ బ్రోవవే నిను
కల్యాణి - రూపక
పల్లవి:
నమ్మి వచ్చిన నన్ను నయముగఁ బ్రోవవే నిను న..
అను పల్లవి:
కొమ్మని వరముల నొసఁగే కోవూరి సుందరేశ న..
చరణము(లు):
వేదపురాణాగమ శాస్త్రాదులు గుమిగూడి
పాదములను గనఁజాలక బతిమాలి వేడ
నాదరూప శ్రీ సౌందర్య నాయకీపతే వేద
వాదరహిత త్యాగరాజవరద సుందరేశ్వర నిను
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - nammi vachchina nannu nayamuga.r broovavee ninu ( telugu andhra )