కీర్తనలు త్యాగరాజు నమ్మినవారిని మఱచేది న్యాయమా రామ
భైరవి - ఆది
పల్లవి:
నమ్మినవారిని మఱచేది న్యాయమా రామ ॥న॥
అను పల్లవి:
కమ్మవిల్తుని గన్న మా చక్కని కల్యాణరామ నిన్ను ॥న॥
చరణము(లు):
చిన్ననాఁటనుండి చిత్తము రా నడిచి
ఎన్నరాని యూడిగము లెంచుచుఁ బూజించి నిన్ను ॥న॥
ఆసమించి రామ నిన్నంతరంగముననుంచి
వాసి వాని యనుచును వర్ణించుచును నెంతోనిన్ను ॥న॥
భోగము లందువేళ బుద్ధి నీ యెడ నుంచే
త్యాగరాజ సన్నుత తారకచరిత నిన్ను ॥న॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - namminavaarini maRacheedi nyaayamaa raama ( telugu andhra )