కీర్తనలు త్యాగరాజు నరసింహా! ననుఁ బ్రోవవే శ్రీ లక్ష్మీ
బిలహరి - త్రిపుట
పల్లవి:
నరసింహా! ననుఁ బ్రోవవే శ్రీ లక్ష్మీ న..
అను పల్లవి:
కొఱమాలిన నరులఁ గొనియాడను నేను
పరమపావన! నా పాలి శ్రీ లక్ష్మీ న..
చరణము(లు):
నీదు భక్తాగ్రేసరుఁడు ప్ర
హ్లాదుఁ డపుడొక కనక కశ్యపు
వాదుకోర్వక నిన్ను శరణని
యాదుకోమన కాచినావు
ఎందుకని సైరింతు నీ మన
సందు తెలియనిదేది? లోకుల
నిందకోర్వక నిన్నుఁ గోరి
నందు కెంతని కరుణఁ జూతువో? న..
నీ జపము నీ స్మరణ నీ పద
పూజ నీ వారి చెలిమి యొసఁగి
రాజిగ దయచేయు త్యాగ
రాజసన్నుత! తరముగాదు న..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - narasiMhaa! nanu.r broovavee shrii laxmii ( telugu andhra )