కీర్తనలు త్యాగరాజు నా జీవాధార నా నోము ఫలమా
బిలహరి - ఆది
పల్లవి:
నా జీవాధార నా నోము ఫలమా నా..
అను పల్లవి:
రాజీవలోచన రాజరాజశిరోమణి నా..
చరణము(లు):
నా చూపు ప్రకాశమా నా నాసికా పరిమళమా
నా జపవర్ణరూపమా నాదు పూజాసుమమా
త్యాగరాజనుత నా..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - naa jiivaadhaara naa noomu phalamaa ( telugu andhra )