కీర్తనలు త్యాగరాజు నా పాలి శ్రీరామ భూపాలకస్తోమ కాపాడసమయము నీ పాదము లీర
శంకరాభరణము - ఆది
నా పాలి శ్రీరామ భూపాలకస్తోమ
కాపాడసమయము నీ పాదము లీర ॥నా॥
భళినభళి భక్తుల పూజాఫలము నీ వనుకొంటి
నళినలోచన నీకు నలుగుబెట్టేరా ॥నా॥
కోటిమన్మథులైన సాటిగా నీ సొగసు
నాటియున్నది మదిని మేటి శ్రీరామ ॥నా॥
తొలిపూజాఫలమేమో కలిగె నీ పదసేవ
నలువకైనను నిన్నుఁ దెలియఁగా తరమా ॥నా॥
పతితపావన నీవు పాలించకుంటేను
గతి మాకెవరు మమ్ము గ్రక్కున బ్రోవు ॥నా॥
కోరి నీ పదసేవ సారెకు సేయను దలఁచి
మా రమణ నాలోనే మరులుకొన్నాను ॥నా॥
నిరుపేద కబ్బిన నిధిరీతి దొరికితివి
వర త్యాగరాజునికి వరద మ్రొక్కేరా ॥నా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - naa paali shriiraama bhuupaalakastooma kaapaaDasamayamu nii paadamu liira ( telugu andhra )