కీర్తనలు త్యాగరాజు నా మొఱలను విని యేమర వలెనా? పామర మనుజులలో
ఆరభి - దేశాది
పల్లవి:
నా మొఱలను విని యేమర వలెనా?
పామర మనుజులలో ఓరామ ॥నా॥
అను పల్లవి:
తోమర నారాచములై మనసుకుఁ
దోచెనా? భక్తపాప విమోచన ॥నా॥
చరణము(లు):
ఇభ రాజేంద్రుఁడు యెక్కువైన
లంచమిచ్చినదేమిరా రామ
సభలో మానము బోవు సమయంబున
సతి యేమిచ్చెనురా ఓ రామ ॥నా॥
భాగవతాగ్రేసర రసికావన
జాగరూకుడని పేరే
రాగ స్వరయుత ప్రేమ భక్త జన
రక్షక త్యాగరాజ వందిత ॥నా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - naa moRalanu vini yeemara valenaa? paamara manujulaloo ( telugu andhra )