కీర్తనలు త్యాగరాజు నాటి మాట మరచితివో? ఓ రామ!
దేవక్రియ - ఆది
పల్లవి:
నాటి మాట మరచితివో? ఓ రామ! చిన్న ॥నాటి॥
అను పల్లవి:
మాటి మాటికి నాపై మన్నన జేయుచు
యేటికి యోచన? నీ భాగ్యము నీదన్న ॥నాటి॥
చరణము(లు):
తరుణుల బాగు నర్తనములఁ జూచువేళ
చరణములను గని నేకరఁగుచు సేవింప
భరతుని కర చామరమును నిల్పుచు
కరుణను త్యాగరాజ వరదుఁడని పల్కిన ॥నాటి॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - naaTi maaTa marachitivoo? oo raama! ( telugu andhra )