కీర్తనలు త్యాగరాజు నాద సుధారసం బిలను నరాకృతాయ మనసా
ఆరభి - రూపకము
పల్లవి:
నాద సుధారసం బిలను నరాకృతాయ మనసా ॥నా॥
అను పల్లవి:
వేదపురాణాగమ శాస్త్రాదుల కాధారమౌ ॥నా॥
చరణము(లు):
స్వరములు యాఱొక ఘంటలు
వరరాగము కోదండము - మే
దుర నయ దేశ్యము త్రిగుణము నిరతగతి శరమురా ॥నా॥
సరస సంగతి సందర్భముగల గిరములురా
ధర భజనే భాగ్యమురా త్యాగరాజు సేవించు ॥నా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - naada sudhaarasaM bilanu naraakR^itaaya manasaa ( telugu andhra )