కీర్తనలు త్యాగరాజు నాదతను మనిశం శంకరం
చిత్తరంజని - ఆది
పల్లవి:
నాదతను మనిశం శంకరం
నమామి మే మనసా శిరసా ॥నా॥
అను పల్లవి:
మోదకర నిగమోత్తమ సామ
వేదసారం వారం వారం ॥నా॥
చరణము(లు):
సద్యోజాతాది పంచవక్త్రజ
సరిగమ పదనీ వరసప్తస్వర
విద్యాలోలం విదళితకాలం
విమలహృదయ త్యాగరాజపాలం ॥నా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - naadatanu manishaM shaMkaraM ( telugu andhra )