కీర్తనలు త్యాగరాజు నాదోపాసన చేసేశంకర నారాయణ విధులు వెలసిరి ఓమనసా
బేగడ - దేశాది
పల్లవి:
నాదోపాసన చేసే శంకర
నారాయణ విధులు వెలసిరి ఓమనసా ॥నాదో॥
అను పల్లవి:
వేదోద్ధరులు వేదాతీతులు
విశ్వమెల్ల నిండి యుండెడి వారలు ॥నాదో॥
చరణము(లు):
మంత్రాత్ములు యంత్ర తంత్రాత్ములు మఱి
మంత్రములన్ని గలవారలు
తంత్రీలయ స్వరరాగ విలోలులు
త్యాగరాజ వంద్యులు స్వతంత్రులు ॥నాదో॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - naadoopaasana cheeseeshaMkara naaraayaNa vidhulu velasiri oomanasaa ( telugu andhra )