కీర్తనలు త్యాగరాజు నారదగానలోల నతజనపరిపాల
అఠాణా - రూపకము
పల్లవి:
నారదగానలోల నతజనపరిపాల ॥నా॥
అను పల్లవి:
నీరదసమనీల నిరుపమగుణశీల ॥నా॥
చరణము(లు):
నీవులేక యే తనువులు నిరతముగా నడచును
నీవులేక యే తరువులు నిక్కముగా మొలచును
నీవులేక యే వానలు నిత్యముగా గురుసును
నీవులేక త్యాగరాజు నీ గుణములనెటు బాడును ॥నా॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - naaradagaanaloola natajanaparipaala ( telugu andhra )