కీర్తనలు త్యాగరాజు నిజమర్మములను దెలిసిన వారిని
ఉమాభరణము - ఆది
పల్లవి:
నిజమర్మములను దెలిసిన వారిని
నీ వలయించే దేమొకో? ॥ని॥
అను పల్లవి:
అజ గజ రక్షక గజ చర్మాంబ
రాది గౌణ భేదముల లీల గల్గఁ జేసిన నీ ॥ని॥
చరణము(లు):
శ్రుతి శాస్త్ర పురాణ వివాది ష
ణ్మత నిష్ఠుల నామ పరాదుల
క్షితి పతులంగ మతులుగా జేసిన
క్షేమ త్యాగరాజనుత శ్రీమనోహర నీ ॥ని॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - nijamarmamulanu delisina vaarini ( telugu andhra )