కీర్తనలు త్యాగరాజు నిను వినా నా మది యెందు నిలువదే శ్రీహరి హరి
నవరస కన్నడ - రూపకం
పల్లవి:
నిను వినా నా మది యెందు
నిలువదే శ్రీహరిహరి ॥నిను॥
అను పల్లవి:
కనులకు నీ సొగసెంతో
గ్రమ్మి యున్నది గనుక ॥నిను॥
చరణము(లు):
నీదు కథలు వీనులందు
నిండియున్నవి రామ
శ్రీద నీ నామము నోటఁ
జెలగి యున్నది గనుక ॥నిను॥
నేను యెచటఁ జూచినను
నీవైయున్నది రామ
భానువంశ తిలక నీదు
భక్తుఁ డనుచు పేరు గనుక ॥నిను॥
కపటమౌ మాట లెల్ల
కమ్మనైనది నా
తపము యొక్క ఫలము నీవే
త్యాగరాజ సన్నుత ॥నిను॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - ninu vinaa naa madi yeMdu niluvadee shriihari hari ( telugu andhra )