కీర్తనలు త్యాగరాజు నినువినా సుఖముఁగాన నీరజనయన
తోడి - రూపకము
పల్లవి:
నినువినా సుఖముఁగాన నీరజనయన ॥ని॥
చరణము(లు):
మనసుకెంతో యానందమై మై పులకించగా ॥ని॥
రూపము ప్రతాపము శరచాపము సల్లాపముగల ॥ని॥
కరుణారస పరిపూర్ణ వరదా మృదువార్తలుగల ॥ని॥
రాగ రసిక రాగరహిత త్యాగరాజ భాగధేయ ॥ని॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - ninuvinaa sukhamu.rgaana niirajanayana ( telugu andhra )