కీర్తనలు త్యాగరాజు నిన్నే నెరనమ్మినానురా ఓరామ! రామయ్య
పంతువరాళి - రూపకం
పల్లవి:
నిన్నే నెరనమ్మినానురా ఓరామ! రామయ్య ॥నిన్నే॥
అను పల్లవి:
అన్ని కల్లలనుచు నాడి పాడి వేడి
పన్నగశయన నే చిన్నతనము నాడె ॥నిన్నే॥
చరణము(లు):
వేద శాస్త్ర పురాణ విద్యలచే భేద
వాదములు దీరక భ్రమయు వారల జూచి ॥నిన్నే॥
భోగముల కొఱకు భువిలో రాసమ్మున
యాగాదు లొనరించి వలయు వారల జూచి ॥నిన్నే॥
ఈ జన్మమున నిన్ను రాజిఁ జేసికొన లేక
రాజిల్లని త్యాగరాజ రాజ రాఘవ ॥నిన్నే॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - ninnee neranamminaanuraa ooraama! raamayya ( telugu andhra )