కీర్తనలు త్యాగరాజు నీ దాసానుదాసుడనని పేరే యేమి ఫలము
హమీరు కల్యాణి - దేశాది
పల్లవి:
నీ దాసానుదాసుడనని పేరే యేమి ఫలము నీ..
అను పల్లవి:
పేదసాధులందు నీకుఁ బ్రేమలేకఁబోయే నీ..
చరణము(లు):
సరివారిలో నన్ను చౌకజేసితివి గాని
కరుణింపలేక నీదు కర్మమనెదవుగాని నీ..
రోసము లేదాయె రుచిరవాక్కులు పోయె
దాసుల బ్రోచితివట త్యాగరాజిలలో నీ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - nii daasaanudaasuDanani peeree yeemi phalamu ( telugu andhra )