కీర్తనలు త్యాగరాజు నీ భజన గాన రసికుల నే నెందుఁ గానరా రామ
నాయకి - ఆది
పల్లవి:
నీ భజన గాన రసికుల నే నెందుఁ గానరా రామ నీ..
అను పల్లవి:
శ్రీభవ సరోజాసనాది శచీమనోరమణవంద్య ఇలలో నీ..
చరణము(లు):
సగుణ నిర్గుణపు నిజదబ్బరలను
షణ్మతముల మర్మ మష్టసిద్ధుల
వగలుచూప సంతసిల్లి గంటిని
వరాసన త్యాగరాజవినుత నీ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - nii bhajana gaana rasikula nee neMdu.r gaanaraa raama ( telugu andhra )