కీర్తనలు త్యాగరాజు నీదయచే రామ నిత్యానందుఁడైతి
యదుకులకాంభోజి - దేశాది
పల్లవి:
నీదయచే రామ నిత్యానందుఁడైతి నీ..
అను పల్లవి:
నాదబ్రహ్మానంద రసాకృతిగల నీ..
చరణము(లు):
వరమృదుభాష సుస్వరమయభూష
వరత్యాగరాజ వాక్చేలావృత నీ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - niidayachee raama nityaanaMdu.rDaiti ( telugu andhra )