కీర్తనలు త్యాగరాజు నీదయరాదా
వసంతభైరవి - రూపకము
పల్లవి:
నీదయరాదా ॥నీ॥
అను పల్లవి:
కాదనే వారెవరు కల్యాణరామా ॥నీ॥
చరణము(లు):
ననుఁ బ్రోచేవాఁడని నాఁడే తెలియ
ఇనవంశతిలక ఇంత తామసమా ॥నీ॥
అన్నిటి కధికారివని నేఁ బొగడితి
మన్నించితే నీదుమహిమకుఁ దక్కువా ॥నీ॥
రామ రామ రామ త్యాగరాజ హృత్సదన
నామది తల్లడిల్లఁగ న్యాయమా వేగమే ॥నీ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - niidayaraadaa ( telugu andhra )