కీర్తనలు త్యాగరాజు నీవంటి దైవము నేఁ గాన నీరజాక్ష శ్రీరామయ్య
భైరవి - ఆది
పల్లవి:
నీవంటి దైవము నేఁ గాన నీరజాక్ష శ్రీరామయ్య నీ..
అను పల్లవి:
భావించి చూచుపట్ల పట్టాభిరామచంద్ర నీ..
చరణము(లు):
ఆడిన నిన్నాడవలెగా పాడిన నిన్నుఁ బాడవలెగా
గూడిన నిన్నుఁగూడవలె నీ జాడ దెలిసిన త్యాగరాజునికి నీ..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - niivaMTi daivamu nee.r gaana niirajaaxa shriiraamayya ( telugu andhra )