కీర్తనలు త్యాగరాజు నీవాఁడ నే గాన నిఖిలలోక నిదాన
సారంగ - జంప
పల్లవి:
నీవాఁడ నే గాన నిఖిలలోక నిదాన
నిమిష మోర్వఁగఁ గలనా ॥ని॥
అను పల్లవి:
దేవాదిదేవ భూదేవ వరపక్ష రా
జీవాక్ష సాధుజనజీవన సనాతన ॥నీ॥
చరణము(లు):
సత్యంబు నిత్యంబు సమరమున శౌర్యంబు
అత్యంతరూపంబు అమితబలము
నిత్యోత్సవంబుగల నీకు నిజదాసుఁడని
తథ్యంబుఁ బల్కు శ్రీ త్యాగరాజార్చిత ॥నీ॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - niivaa.rDa nee gaana nikhilalooka nidaana ( telugu andhra )