కీర్తనలు త్యాగరాజు నెనరుంచినాను అన్నిటికి
మాళవి - ఆది
పల్లవి:
నెనరుంచినాను అన్నిటికి
నిదానుఁడని నేను నీదుపై నె..
అను పల్లవి:
ఘనాఘజీమూతాశుగ జలధి
గంభీర నీ పాదములపై నె..
చరణము(లు):
కలిలో మాటల నేర్చుకొని
కాంతలను దనయులఁ బ్రోచుటకు
శిలాత్ముఁడై పలుకనేరనుర
శ్రీ త్యాగరాజాప్త నీ యెడ నె..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - nenaruMchinaanu anniTiki ( telugu andhra )