కీర్తనలు త్యాగరాజు నే నెందు వెతుకుదురా హరి
బేహాగ్‌ - ఆది
పల్లవి:
నే నెందు వెతుకుదురా హరి ॥నే॥
అను పల్లవి:
ఆనాల్గు మోములవాని మొఱ
నాలకించి రాని నిన్ను ॥నే॥
చరణము(లు):
కలుషాత్ముఁడై దుష్కర్మయుతుఁడై
పలుమారు దుర్భాషియై
ఇలలో భక్తాగ్రేస
రులవేషియై త్యాగరాజ పూజిత ॥నే॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - nee neMdu vetukuduraa hari ( telugu andhra )