కీర్తనలు త్యాగరాజు పరితాపముఁగని యాడిన
మనోహరి - రూపక
పల్లవి:
పరితాపముఁగని యాడిన
పలుకుల మఱచితివో నా ప..
అను పల్లవి:
సరిలేని సీతతో సరయూమధ్యంబున నా ప..
చరణము(లు):
వరమగు బంగారువాడను
మెఱయుచుఁ బదిపూటలపైఁ
గరుణించెద ననుచు క్రీఁ
గనుల త్యాగరాజుని ప..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - paritaapamu.rgani yaaDina ( telugu andhra )