కీర్తనలు త్యాగరాజు పరిపాలయ మాం కోదండపాణే
దర్బారు - చాపు
పల్లవి:
పరిపాలయ మాం కోదండపాణే
పావనాశ్రిత చింతామణే ॥ప॥
అను పల్లవి:
సరసిజ భవనుత చరణసరోజ
సాకేతసదన దశరథతనూజ ॥ప॥
చరణము(లు):
శేషాధిప వరభూషణ వాగ్వి
శేషకృతనామ ఘోరజనిత సం
తోష రవిజసంభాషణ నతజన
పోషణ శుభకరవేష నిర్దోష ॥ప॥
సత్యసంధ వరభృత్యపాలకా
దిత్య కులోత్తమ సత్యజనావన
అత్యంతసుందర నృత్యజనప్రియ
స్తుత్య సుచారిత్ర నిత్యోత్సవరూప ॥ప॥
సాగరమదదమన నాగారినుత చర
ణగణపతిహృదయాగార పాలన
జాగరూక శరణాగతవత్సల
త్యాగరాజనుత నాగారితురగ ॥ప॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - paripaalaya maaM koodaMDapaaNee ( telugu andhra )