కీర్తనలు త్యాగరాజు పరిపూర్ణకామ భావమున మఱచినాను
పూరి కల్యాణి - రూపక
పల్లవి:
పరిపూర్ణకామ భావమున మఱచినాను ప..
అను పల్లవి:
పరమకారుణికోత్తమ భవజీవనజ భవార్చిత ప..
చరణము(లు):
సాకేతాథిప నీ ముఖసరసీరుహమును జూపి
సాకే మదిలేదేటి సవరణ రా రామ
ఈ కలి ననుసరించిన హీనజాతి మర్త్యుల చీ
కాకు బడఁగఁ దరమె శ్రీకర త్యాగరాజవినుత ప..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - paripuurNakaama bhaavamuna maRachinaanu ( telugu andhra )