కీర్తనలు త్యాగరాజు పరియాచికమా మా మాట పదుగురిలో పొగడినది
వనస్పతి - ఆది
పల్లవి:
పరియాచికమా మా మాట పదుగురిలో పొగడినది ప..
అను పల్లవి:
వెరపులను మానమున వ్యసనంబులచే గోరి
శరణాగతరక్షక నిను సంతతమును శరణంబే ప..
చరణము(లు):
ఒకమునికై ద్రౌపతి ద్వారకానిలయా శరణనగ
ఒకమాటకు విభీషణుడు ఓర్వలేక శరణనగ
సకలేశ్వర ప్రహ్లాదు జాలిచే శరణనగ హి
త కరుండై బ్రోచితి త్యాగరాజుని మాట ప..
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - pariyaachikamaa maa maaTa paduguriloo pogaDinadi ( telugu andhra )