కీర్తనలు త్యాగరాజు పలుకవేమి నా దైవమా
పూర్ణచంద్రిక - ఆది
పల్లవి:
పలుకవేమి నా దైవమా
పరులు నవ్వేది న్యాయమా ॥ప॥
అను పల్లవి:
అలుగఁ గారణమేమిరా రామ నీ
వాడించినట్లు యాడిన నాతో ॥ప॥
చరణము(లు):
తల్లిదండ్రి భక్తినొసంగి రక్షించిరి
తక్కినవార లెంతో హింసించిరి
దెలిసి యూరకుండేది యెన్నాళ్లురా
దేవాదిదేవ త్యాగరాజునితో ॥ప॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - palukaveemi naa daivamaa ( telugu andhra )