కీర్తనలు త్యాగరాజు పాలింతువో పాలింపవో? బాగైనఁ బల్కుఁ బల్కి నను
కాంతామణి - దేశాది
పల్లవి:
పాలింతువో పాలింపవో?
బాగైనఁ బల్కుఁ బల్కి నను ॥పాలింతువో॥
అను పల్లవి:
ఏలాగు నిన్నాడుకొన్న నేర
మెంచఁ బనిలేదు నాదుపైని ॥పాలింతువో॥
చరణము(లు):
పరమార్థమగు నిజమార్గమును
వరదేశికుం డానతీయగ
పరిపూర్ణమౌ భక్తి మార్గమే యని
భావించిన త్యాగరాజుని ॥పాలింతువో॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - paaliMtuvoo paaliMpavoo? baagaina.r balku.r balki nanu ( telugu andhra )