కీర్తనలు త్యాగరాజు పాహి మాం శ్రీరామచంద్ర, పాహి మాం శ్రీరామ
కాపి - ఝంప
పల్లవి:
పాహి మాం శ్రీరామచంద్ర, పాహి మాం శ్రీరామ ॥పాహి॥
చరణము(లు):
అక్కరతో పాదములకు మ్రొక్కితి యేల పరాకు ॥పాహి॥
దిక్కునీవైయుండగాను గ్రక్కున వేడు కొన్నను ॥పాహి॥
మక్కువతో రామ నీవు ఎక్కువజేసి నన్ను బ్రోవు ॥పాహి॥
చక్కని నీ ముద్దు మోము ఒక్కసారి కనుపింపుము ॥పాహి॥
అన్నిటనే నెలకొన్న నిన్ను మించిన వారెవరన్న ॥పాహి॥
చిన్ననాడే యనుసరించి కొన్నవాఁడని నను పాలించు ॥పాహి॥
పన్నగ భూషణుఁడ చాల నిన్ను కొనియాడు నీవేళ ॥పాహి॥
మన్నగ జేసి యేలవయ్యా పన్న రక్షక రామయ్య ॥పాహి॥
పన్నుగ శ్రీ త్యాగరాజ సన్నుత భాస్కర తేజ ॥పాహి॥
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - paahi maaM shriiraamachaMdra, paahi maaM shriiraama ( telugu andhra )